అంగన్వాడీల ర్యాలీపై వైసీపీ ఫేక్ ప్రచారం.. నారాలోకేష్ ఫైర్

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-28 07:04:11  IST  )

పెనమలూరులో మంత్రి నారాలోకేష్ పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అంటూ ఓ ఛానల్ లో ప్రచారం చేశారు. దీనిపై లోకేష్ ఘాటుగా స్పందించారు.

అంగన్వాడీల ర్యాలీపై వైసీపీ ఫేక్ ప్రచారం..  నారాలోకేష్ ఫైర్
X

దిశ, వెబ్ డెస్క్: పెనమలూరులో మంత్రి నారాలోకేష్ పర్యటనలో అంగన్వాడీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు అంటూ ఓ ఛానల్ లో ప్రచారం చేశారు. దీనిపై లోకేష్ ఘాటుగా స్పందించారు. వైసీపీ హయాంలో అంగన్వాడీ కార్యకర్తలకు అమ్మఒడి ఇవ్వకుండా అన్యాయం చేసింది గొడ్డలి పార్టీ అని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అంగన్వాడీలకు తల్లికి వందనం పథకం వర్తింపజేస్తోందని పేర్కొన్నారు. దానికి వారు పెన‌మ‌లూరు నియోజ‌క‌వ‌ర్గ ప‌ర్య‌ట‌న‌లో కృత‌జ్ఞ‌త‌లు తెలిపారని అన్నారు. గొడ్డ‌లిపోటును గుండెపోటుగా ప్ర‌చారం చేసిన గొడ్డ‌లి పార్టీ, అంగ‌న్వాడీల కృత‌జ్ఞ‌త ర్యాలీని నిర‌స‌న ర్యాలీ అంటూ ప్ర‌చారం చేస్తోంద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కాగా లోకేష్ షేర్ చేసిన పోస్టులో అంగ‌న్వాడీ కార్య‌క‌ర్త‌లు త‌మ స‌మ‌స్య‌లు నెర‌వేర్చాల‌ని నిర‌స‌న తెలిపిన‌ట్టు క‌నిపిస్తోంది. నిర‌స‌న తెలుపుతుంటే లోకేష్ ఆగ‌కుండా వెళ్లిపోయాడ‌ని రాసి ఉంది. దీంతో లోకేస్ అస‌లు ఫోటో ఫేక్ ఫోటో అంటూ రెండు ఫోటోల‌ను జ‌త చేసి వైసీపీకి కౌంట‌ర్ ఇచ్చారు.

లోకేష్ చర్చకు వస్తే నేనే వస్తా.. పేర్నినాని సవాల్

Next Story