- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కంగనాపై ప్రశంసలు కురిపించి చిక్కుల్లో పడిన ఐశ్వర్య లక్ష్మి
నాకు కంగనా రనౌత్ అంటే చాలా ఇష్టం. ఆమె ఒక మ్యాడ్ జీనియస్.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ బ్యూటీ ఐశ్వర్య లక్ష్మి ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా దుమారం రేపుతున్నాయి. ఒక ఇంటర్వ్యూ క్లిప్ నెట్టింట వైరల్ కావడంతో, ఆమెపై నెటిజన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. బాలీవుడ్ నటి, ఎంపీ కంగనా రనౌత్‌ను ప్రశంసించడమే ఈ రచ్చకు కారణమైంది. ఓ ఇంటర్వ్యూలో ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. "నాకు కంగనా రనౌత్ అంటే చాలా ఇష్టం. ఆమె ఒక మ్యాడ్ జీనియస్. తనను తాను మలుచుకుని మాట్లాడే శైలి, ముఖ్యంగా పార్లమెంట్‌లో ఆమె ఇచ్చే ప్రసంగాలు నాకు ఎంతగానో నచ్చుతాయి. నేను కంగనాకు పెద్ద అభిమానిని" అని చెప్పారు. ఐశ్వర్య ఆమెను ప్రశంసించడం చాలామంది నెటిజన్లకు నచ్చలేదు.
దీంతో ట్విట్టర్ వేదికగా ఐశ్వర్యను ఉద్దేశించి.. మీ నుంచి ఇలాంటి మాటలు ఊహించలేదు. కంగనాను అనుకరిస్తున్నారా? అంటూ నెగెటివ్ కామెంట్లు చేస్తూ ట్రోల్ చేయడం ప్రారంభించారు. అయితే, ఈ వ్యవహారంలో ఐశ్వర్యకు మద్దతుగా నిలిచేవారు కూడా ఉన్నారు. కంగనా రాజకీయ అభిప్రాయాలను పక్కన పెడితే, ఒక నటిగా ఆమె నైపుణ్యాన్ని, మాట్లాడే తీరును మెచ్చుకోవడంలో తప్పులేదని అభిప్రాయపడుతున్నారు. ఒకరి వ్యక్తిగత అభిప్రాయాలపై ఇలా దాడి చేయడం సరికాదని పేర్కొంటున్నారు.ప్రస్తుతం ఐశ్వర్య లక్ష్మి తెలుగులో ‘సంబరాల ఏటి గట్టు’ , మలయాళంలో ‘ఆశ’ చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరోవైపు కంగనా రనౌత్ ‘భారత్ భాగ్య విధాత’, ‘క్వీన్ 2’ చిత్రాల్లో నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ వీడియో ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.






