కాచిగూడలో విషాదం.. బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో మహిళ మృతి

by Taduka Kalyani |

కాచిగూడలో మంగళవారం ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో స్కూటీ అదుపుతప్పి బస్సు కిందపడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది.

కాచిగూడలో విషాదం.. బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో మహిళ మృతి
X

దిశ, సికింద్రాబాద్: కాచిగూడలో మంగళవారం ఉదయం విషాదకర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసే ప్రయత్నంలో స్కూటీ అదుపుతప్పి బస్సు కిందపడటంతో ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల కథనం ప్రకారం, మహిళ స్కూటీపై ప్రయాణిస్తుండగా ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేయడానికి ప్రయత్నించింది. ఈ క్రమంలో స్కూటీ అదుపుతప్పి బస్సు కిందకు వెళ్లడంతో తీవ్ర గాయాలపాలైంది. సమాచారం అందుకున్న అంబులెన్స్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించగా, అప్పటికే మహిళ మృతి చెందినట్లు నిర్ధారించారు. అనంతరం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story