- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త యూనిఫామ్స్
తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కొత్త యూనిఫామ్‌లను ఖరారు చేసింది.

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల (Government Schools Students)కు ఇచ్చే యూనిఫామ్స్ (Uniforms) పై సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. అధికారులతో జరిగిన సమావేశం అనంతరం రాష్ట్ర ప్రభుత్వం (State Govt) విద్యార్థులకు కొత్త యూనిఫామ్‌లను ఖరారు చేసింది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బాలుర షర్టులు, బాలికల టాప్‌లను లైట్ బ్లూ రంగులో, బాలుర ప్యాంట్లు, బాలికల బాటమ్స్‌ను ముదురు నీలం (డార్క్ బ్లూ) రంగులో నిర్ణయించారు. ఇక గురుకుల పాఠశాల పిల్లలకు మెరూన్ చెక్స్ ఉన్న టాప్స్, ప్లెయిన్ మెరూన్ లోవర్లను ఖరారు చేశారు. ఈసారి ప్రాథమిక స్థాయి మార్పుగా 6వ తరగతి నుంచే బాలురకు నిక్కర్లకు బదులుగా ప్యాంట్లు పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దాదాపు 27 లక్షల మంది విద్యార్థులకు ఒక్కొక్కరికి రెండు జతల చొప్పున ఈ కొత్త యూనిఫామ్‌లను అందించనున్నారు. ఇందులో మొదటి జత దుస్తులను ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. దుస్తులతో పాటు విద్యార్థులందరికీ బూట్లు, సాక్సులు, టై, బెల్ట్‌ను కూడా సర్కారు ఉచితంగా అందజేయనుంది. ఈ నిర్ణయంతో సర్కారీ బడుల్లో చదివే పిల్లలకు సరికొత్త కార్పొరేట్ లుక్ రానున్నట్లు తెలుస్తోంది.






