జలసిరితో రైతులకు సాగునీటి భరోసా:కలెక్టర్ సత్యప్రసాద్

by Jakkula.Mamatha |

జలసిరితో రైతులకు సాగునీటి భరోసా అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.

జలసిరితో రైతులకు సాగునీటి భరోసా:కలెక్టర్ సత్యప్రసాద్
X

దిశ, కోరుట్ల రూరల్: జలసిరితో రైతులకు సాగునీటి భరోసా అని కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు. మండలంలోని పైడిమడుగు గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా ఫామ్ పాండ్ నిర్మాణ పనులను కొబ్బరికాయ కొట్టి లాంఛనంగా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫామ్ పాండ్‌ల నిర్మాణంతో భూగర్భ జలాలు పెరగడంతో పాటు సాగునీటి సమస్యలు తగ్గి రైతులకు ఎంతో ప్రయోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. ప్రభుత్వం చేపట్టిన జలసిరి కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ రఘువరన్, ఎంపీడీఓ వోదెల రామకృష్ణ , ఎంపీఓ రాజశేఖర్, గ్రామ సర్పంచ్ బడుగు భూమేశ్వర్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story