రామ్ చరణ్ సర్జరీ చేయించుకోవడంపై కీలక నోట్ విడుదల చేసిన ‘పెద్ది’ మేకర్స్

by Mallepaka Hamsa |

నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ రామ్ చరణ్ చూపిన అంకితభావం అద్భుతమని వారు ప్రశంసలు కురిపించారు.

రామ్ చరణ్ సర్జరీ చేయించుకోవడంపై కీలక నోట్ విడుదల చేసిన ‘పెద్ది’ మేకర్స్
X

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన 'పెద్ది' మూవీ షూటింగ్ సమయంలో ఆయన కుడిచేతి మణికట్టుకు తీవ్రంగా గాయమైన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తమిళనాడులోని కోయంబత్తూరు గంగా ఆసుపత్రిలో సోమవారం వైద్యుల పర్యవేక్షణలో శస్త్రచికిత్స చేయించుకున్నారు. ఈ సర్జరీ విజయవంతంగా పూర్తయిందని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. రామ్ చరణ్ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారని తెలుసుకుని అభిమానులు, సినీ ప్రముఖులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక ఈ ఘటనపై 'పెద్ది' సినిమా మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. నొప్పితో ఇబ్బంది పడుతున్నప్పటికీ రామ్ చరణ్ చూపిన అంకితభావం అద్భుతమని వారు ప్రశంసలు కురిపించారు.

"నొప్పి ఉన్నప్పటికీ ఆయన ఎంతో నిబద్ధతతో షూటింగ్‌ను కొనసాగించి, సినిమాలోని అత్యంత కీలకమైన సన్నివేశాలను పూర్తి చేశారు. ఆయన పని పట్ల చూపించిన ప్రేమాభిమానాలు, పట్టుదల మొత్తం చిత్రబృందానికి ఎంతో స్ఫూర్తినిచ్చాయి" అని పేర్కొన్నారు. రామ్ చరణ్ త్వరలోనే పూర్తి ఆరోగ్యంతో, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి షూటింగ్ సెట్స్‌లోకి రావాలని ఆకాంక్షిస్తూ మేకర్స్ ఒక ప్రత్యేక ప్రకటనను విడుదల చేశారు. రామ్ చరణ్ గాయపడ్డారనే వార్త వినగానే సోషల్ మీడియాలో గెట్ వెల్ సూన్ రామ్ చరణ్ అనే ట్రెండ్ మొదలైంది. ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ లక్షలాది మంది అభిమానులు, పలువురు సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా మెసేజ్‌లు పోస్ట్ చేస్తున్నారు. డాక్టర్ల సలహా మేరకు ఆయన కొద్దిరోజుల పాటు విశ్రాంతి తీసుకోనున్నారు. ఆ తర్వాత మళ్లీ తన తదుపరి సినిమా షూటింగ్స్‌లో పాల్గొన్నబోతున్నట్లు తెలుస్తోంది.

Next Story