- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పారిస్‌లో కత్తులతో రెచ్చిపోయిన మతోన్మాధి.. మహిళలపై విచక్షణారహితంగా దాడి
పారిస్‌లో ఓ మతోన్మాది రెచ్చిపోయాడు. రెండు కత్తులతో రోడ్డుపై స్వైర విహారం చేశాడు. రోడ్డుపై వెళుతున్న గర్భిణితో పాటు మరో ముగ్గురు మహిళలపై దాడి చేశాడు. రో

దిశ, వెబ్ డెస్క్: పారిస్‌లో ఓ మతోన్మాది రెచ్చిపోయాడు. రెండు కత్తులతో రోడ్డుపై స్వైర విహారం చేశాడు. రోడ్డుపై వెళుతున్న గర్భిణితో పాటు మరో ముగ్గురు మహిళలపై దాడి చేశాడు. రోడ్డు పై పరిగెడుతూ కనిపించిన మహిళలను కత్తితో దాడి చేస్తూ వెళ్లాడు. స్థానికులు అరుస్తున్నప్పటికీ అతడు మహిళలపై దాడి చేస్తూ వెళ్లాడు. దీనికి సంబంధించిన వీడియోలు కొందరు తమ ఫోన్ లలో రికార్డ్ చేశారు. యువకుడిని చూసిన స్థానికులు పట్టుకుని చితకబాదారు అనంతరం పోలీసులకు అప్పగించారు. పట్టుకున్న అనంతరం అల్లా తనకు ఆదేశాలు ఇచ్చాడు అంటూ వ్యాఖ్యానించాడు. దీంతో అతడి మానసిక పరిస్థితిపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఉగ్రవాద కోణంలోనూ విచారణ జరుపుతున్నారు. స్థానికుడు పట్టుకున్న సమయంలోనూ యువకుడి కదలికలు అనుమానం కలిగించేలా ఉన్నాయి. చుట్టూ చూస్తూ యువకుడు భయపడుతూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు. యువకుడిని చూసిన ప్రజలు సైతం అతడి చేష్టలకు బయపడిపోయారు.






