రాజ‌కీయ నైతిక‌త‌కు ప్ర‌తీక జైపాల్ రెడ్డి: CM రేవంత్

by Gantepaka Srikanth |

రాజ‌కీయాల్లో నైతిక‌త‌కు ప్రతీక‌ కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు.

రాజ‌కీయ నైతిక‌త‌కు ప్ర‌తీక జైపాల్ రెడ్డి: CM రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: రాజ‌కీయాల్లో నైతిక‌త‌కు ప్రతీక‌ కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్ రెడ్డి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొనియాడారు. కేంద్ర మాజీ మంత్రి ఎస్‌.జైపాల్ రెడ్డి వ‌ర్ధంతిని పుర‌స్కరించేకొని ఆయ‌న చిత్ర‌ప‌టానికి సీఎం రేవంత్ రెడ్డి పూల‌మాల వేసి నివాళుల‌ర్పించారు. విద్యార్థి నాయ‌కునిగా ప్ర‌స్థానం ప్రారంభించిన జైపాల్ రెడ్డి.. త‌న తుదిశ్వాస వ‌ర‌కు విలువ‌లు, సిద్ధాంతాలకు క‌ట్టుబ‌డి ఉన్నారని సీఎం పేర్కొన్నారు. త‌న విష‌య ప‌రిజ్ఞానం, వాగ్ధాటితో ఇటు ప్రజ‌ల్లో అటు పార్ల‌మెంట్‌లో త‌నదైన ముద్ర వేసిన ఘ‌న‌త జైపాల్ రెడ్డిద‌ని సీఎం తెలిపారు. ఆయ‌న ఆశ‌యాల‌ను రాష్ట్ర ప్ర‌భుత్వం కొన‌సాగిస్తుంద‌ని సీఎం తెలిపారు. ఈ కార్య‌క్ర‌మంలో పీసీసీ అధ్య‌క్షుడు మ‌హేష్ గౌడ్‌, కాంగ్రెస్ నేత‌లు రోహిణ్ రెడ్డి, తుమ్మ‌ల యుగంధ‌ర్ పాల్గొన్నారు.

Next Story