- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దళితుల ఓట్లు కావాలి.. సంక్షేమం వద్దా ?
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, స్వయం ఉపాధి పథకాల నిధులు విడుదల కాకపోవడం దళిత సమాజాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని ఉమ్మడి మెదక్ జిల్లా దళిత సంఘాల నాయకుడు తలారి దేవరాజ్ విమర్శించారు.

దిశ, వట్‌పల్లి : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు, స్వయం ఉపాధి పథకాల నిధులు విడుదల కాకపోవడం దళిత సమాజాన్ని తీవ్ర నిరాశకు గురిచేసిందని ఉమ్మడి మెదక్ జిల్లా దళిత సంఘాల నాయకుడు తలారి దేవరాజ్ విమర్శించారు.
హామీలకు భిన్నంగా పాలన
అధికారంలోకి రావడానికి ముందు దళిత సంక్షేమంపై అనేక హామీలు ఇచ్చిన ప్రభుత్వం, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలులో వెనుకబడిందని ఆయన అన్నారు. ఎస్సీ కార్పొరేషన్ రుణాల కోసం వేలాది మంది యువత, మహిళలు, నిరుద్యోగులు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు.
దళిత ప్రజాప్రతినిధులు స్పందించాలి
ఎస్సీ నియోజకవర్గాల నుంచి ఎన్నికైన ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి, ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. దళితుల ఆకాంక్షలను విస్మరించడం తగదని అన్నారు.
నిధులు విడుదల చేయకపోతే ఉద్యమమే
ఎస్సీ కార్పొరేషన్ నిధులను వెంటనే విడుదల చేసి, అర్హులైన లబ్ధిదారులకు రుణాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు నిర్వహిస్తామని హెచ్చరించారు.
ఎన్నికల్లో దళితుల తీర్పు..
దళితుల సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేస్తే, రానున్న ఎన్నికల్లో దళిత సమాజం తమ ఓటుతో స్పష్టమైన తీర్పు ఇస్తుందని తలారి దేవరాజ్ పేర్కొన్నారు.






