గొంతులో ఇరుక్కున్న గుడ్డు..! కాపాడిన ఫ్రెండ్

by Muthe.Rajitha |

సాధారణంగా గొంతులో ఎముకలు, లేదంటే చేపముల్లు, ఒక్కోసారి కాయిన్స్ ఇరుక్కుంటాయి. అయితే కేరళలో ఓ వ్యక్తికి గొంతులో గుడ్డు అడ్డం పడి ఇరుక్కుంది.

గొంతులో ఇరుక్కున్న గుడ్డు..! కాపాడిన ఫ్రెండ్
X

దిశ, వెబ్ డెస్క్ : సాధారణంగా తింటున్నప్పుడు గొంతులో చేపముల్లు, ఎముకలు లేదా చిన్న పిల్లల గొంతులో నాణాలు ఇరుక్కుపోవడం చూస్తుంటాం. కానీ కేరళలో ఊహించని విధంగా ఓ వ్యక్తి గొంతులో కోడిగుడ్డు ఇరుక్కుని ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. అయితే సమయస్ఫూర్తితో వ్యవహరించిన అతడి స్నేహితుడు సరైన ప్రథమ చికిత్స అందించి ప్రాణాలను కాపాడాడు.

కేరళలోని ఎర్నాకుళంలో ఉన్న ఒక మెస్‌లో కొందరు స్నేహితులు భోజనం చేస్తుండగా ఈ ఘటన జరిగింది. అందులో ఒక వ్యక్తి ఆహారం తింటుండగా అకస్మాత్తుగా గుడ్డు గొంతులో అడ్డుపడటంతో ఊపిరి ఆడక విలవిలలాడాడు. పరిస్థితి తీవ్రతను గమనించిన అతడి స్నేహితుడు ఏమాత్రం కంగారు పడకుండా 'హెమ్‌లిచ్ మాన్యూవర్' (Heimlich Maneuver) పద్ధతిలో వెనుక నుండి పొత్తికడుపు భాగంలో నొక్కుతూ ప్రథమ చికిత్స అందించాడు. దీంతో గొంతులో ఇరుక్కుపోయిన గుడ్డు ముక్క బయటకు వచ్చి పడింది.

అనంతరం బాధితుడిని ఆసుపత్రికి తరలించగా, అతడు పూర్తి సురక్షితంగా ఉన్నాడని ప్రాణాపాయం తప్పిందని వైద్యులు ధ్రువీకరించారు. చోకింగ్ సమయంలో కంగారు పడకుండా సరైన సమయానికి ప్రథమ చికిత్స అందించి ప్రాణాలు నిలిపిన ఆ స్నేహితుడి సమయస్ఫూర్తిపై ఇప్పుడు సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తోంది.

Next Story