- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భూముల రీసర్వే పనులను పారదర్శకంగా పూర్తి చేయాలి: జాయింట్ కలెక్టర్
భూములు రీసర్వే పనులను పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పూర్తి చేయాలని వనపర్తి జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు.

దిశ, ఖిల్లా గణపురం: మంగళవారం భూములు రీసర్వే పనులను పారదర్శకంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా పూర్తి చేయాలని వనపర్తి జాయింట్ కలెక్టర్ వినోద్ కుమార్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసింది ఈ గ్రామంలో జరుగుతున్న రీసెర్వే పనులను జాయింట్ కలెక్టర్ క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సర్వే బృందాలు రైతుల సమక్షంలోనే భూమికి సంబంధించిన సరిహద్దులను స్పష్టంగా గుర్తించి వారికి సూచించాలని డ్రోన్ రోవర్ వంటి ఆధునిక సర్వే పరికరాలను సమర్ధవంతంగా వినియోగించి భూ విస్తీర్ణం నమోదులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఖచ్చితత్వముతో సర్వే నిర్వహించాలని ఆదేశించారు. సర్వే ప్రక్రియలో రైతులకు ఎలాంటి సందేహాలు అభ్యంతరాలు తలెత్తిన రెవెన్యూ అధికారులు సర్వేయర్లు వెంటనే స్పందించి వాటిని అక్కడికక్కడే పరిష్కరించాలని సూచించారు. రీసర్వే పూర్తయిన భూములకు సంబంధించిన వివరాలను వెంటనే రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని భూ యజమానుల వివరాలు సరిహద్దులు విస్తీర్ణం వంటి అంశాల్లో ఎలాంటి లోపాలు లేకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ తనిఖీలో రెవెన్యూ శాఖ ఏడీ శ్రీనివాసులు సర్వేయర్ ఆనంద్ సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వే బృందాలు సాంకేతిక సిబ్బంది పాల్గొన్నారు.






