హెపటైటిస్‌పై అవగాహన పెంపొందించాలి: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి

by Kodari Anjali |   (  Updated:2026-07-28 13:20:17  IST  )

ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు.

హెపటైటిస్‌పై అవగాహన పెంపొందించాలి: మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి
X

దిశ, మేడ్చల్ బ్యూరో: ప్రపంచ హెపటైటిస్ దినోత్సవం సందర్భంగా ఆల్వాల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన ర్యాలీని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డా. కె. ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హెపటైటిస్ కాలేయానికి సంబంధించిన తీవ్రమైన వ్యాధి అని, సకాలంలో పరీక్షలు, చికిత్సలు తీసుకోవడం ద్వారా తీవ్రమైన సమస్యలను నివారించవచ్చని తెలిపారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం, టీకాలు వేయించుకోవడం, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలో పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ జిల్లా వైద్యాధికారి డా. లావణ్య రెడ్డి, జిల్లా ప్రోగ్రామ్ అధికారి డా. శ్రీదేవి, జిల్లా సర్వేలన్స్ అధికారి డా. నాగరాజ్, ఆల్వాల్ పీహెచ్‌సీ వైద్యాధికారి డా. శ్రీకాంత్, వైద్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు, స్థానికులు పాల్గొన్నారు.

Next Story