Results Out: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల

by Kema Shiva Kumar |

తెలంగాణ MHSRB పరిధిలోని 500 స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి.

Results Out: స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదల
X

దిశ, తెలంగాణ బ్యూరో: డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కేర్ (తెలంగాణ వైద్య విధాన పరిషత్) పరిధిలోని ప్రభుత్వ హాస్పిటళ్లకు సంబంధించి స్పెషలిస్ట్ డాక్టర్ పోస్టుల ఫలితాలు విడుదలయ్యాయి. జనరల్ సర్జరీ, జనరల్ మెడిసిన్, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ విభాగాల్లోని మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఇవాళ విడుదల చేసింది. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం మొత్తం 1,616 సివిల్ అసిస్టెంట్ సర్జన్ (స్పెషలిస్ట్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో అనస్థీషియా, గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్ విభాగాలకు సంబంధించిన 692 పోస్టుల భర్తీ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. తాజాగా జనరల్ సర్జరీ-174, జనరల్ మెడిసిన్-166, ఆర్థోపెడిక్స్-89, రేడియాలజీ-71 చొప్పున మొత్తం 500 పోస్టులకు సంబంధించిన ఫలితాలు విడుదలయ్యాయి. పూర్తి వివరాలను ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఉంచినట్లు అధికారులు తెలిపారు. ఈ పోస్టులకు ఎంపికైన వారికి ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అభినందనలు తెలిపారు.

Next Story