- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్‌లో 20 లక్షల ఓట్లు డిలీట్?.. ఎన్నికల అధికారుల కీలక ప్రకటన
హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆబ్సెంట్, షిప్టెడ్, డెత్ ఓటర్లకు సంబంధించిన 4.79లక్షల ఓట్లను తొలిగించే జాబితాలో చేర్చామని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ జిల్లా పరిధిలో ఆబ్సెంట్ (హాజరు కాని), షిప్టెడ్, డెత్ ఓటర్లకు సంబంధించిన 4.79లక్షల ఓట్లను తొలిగించే జాబితాలో చేర్చామని జీహెచ్ఎంసీ కమిషనర్, హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ.కర్ణన్ తెలిపారు. ఒక వేళ ఎవరైనా డెత్ ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ నింపిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఆయన హెచ్చరించారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మంగళవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నగరంలోని పలు ప్రాంతాల్లో ప్రైవేట్ హాస్టల్స్‌కు చెందిన వారు, గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు తమ ఎన్యూమరేషన్ ఫామ్స్ ఇవ్వడంలేదని తెలిపారు. ఇప్పటికైనా ఈఆర్ఓ, బీఎల్ఓల దగ్గర ఎన్యూమరేషన్ ఫామ్స్ తీసుకోవాలని సూచించారు. ఎన్యూమరేషన్ ఇవ్వడానికి చివరిదాకా ఆగొద్దని, డిజిటైజ్ చేయాలంటే ముందుగానే ఇవ్వాలని సూచించారు. పోలింగ్ బూత్ లను రేషనలైజేషన్ చేయాల్సి ఉందని, 1200 కంటే అధికంగా ఓటర్లను పోలింగ్ కేంద్రాలను రెండుగా చేయాలని నిర్ణయించామని తెలిపారు. చాంద్రాయణగుట్ట నియోజకవర్గంలో రెండు, కార్వాన్, బహదూర్ పుర నియోజకవర్గాల్లో ఒక్కో పోలింగ్ కేంద్రంలో 1200 కంటే ఎక్కువ ఓటర్లు ఉన్నారని, వీటిని రెండుగా చేయనున్నామని తెలిపారు. ఎస్ఐఆర్‌కు, సంక్షేమ పథకాలకు ఏలాంటి సంబంధం లేదని కమిషనర్ స్పష్టం చేశారు. అనవసరంగా హైదరాబాద్‌లో ఉంటేనే సంక్షేమ పథకాలు వర్తిస్తాయనే అపోహాలు పెట్టుకోవద్దని సూచించారు. మీకు నచ్చిన ఏరియాలో ఓటుకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్ నింపాలని సూచించారు.
20 లక్షల ఓట్లు తొలగింపు..
హైదరాబాద్ జిల్లాలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో 20 లక్షల ఓట్లను తొలగించడానికి ఎన్నికల సంఘం సిద్ధమైంది. జిల్లాలో 47,36,669 మంది ఓటర్లు ఉన్నారు. వీటిలో ఎన్యూమరేషన్ ఫామ్స్ అందజేసిన 25,26,014 మంది ఓటర్లకు సంబంధించిన ఫామ్స్ ను అధికారులు డిజిటైజ్ చేశారు. దీంతోపాటు ఆబ్సెంట్, షిఫ్టెండ్, డెత్ ఓటర్లు 4,79,405 ఫామ్స్ ను కలిపి మొత్తం 30,04,419 ఓటర్లకు సంబంధించిన ఫామ్స్ ను సైతం డిజిటైజ్ చేశారు. మరో 17,32,250 ఓటర్లకు సంబంధించిన ఫామ్స్ డిజిటైజ్ చేయాల్సి ఉంది. అయితే వీటిలో 2,11,655ఓటర్లకు సంబంధించిన ఎన్యూమరేషన్ ఫామ్స్ మాత్రమే వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా హైదరాబాద్ జిల్లాలో సుమారు 20 లక్షల ఓట్లను తొలగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అధికారులు భావిస్తున్నారు.






