- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పుల బాధతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య
అప్పుల బాధతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో చోటుచేసుకుంది.

దిశ, సిద్దిపేట అర్బన్ : అప్పుల బాధతో ఉరి వేసుకుని వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన సిద్దిపేట రూరల్ మండలంలోని చింతమడక గ్రామంలో చోటుచేసుకుంది. రూరల్ ఎస్సై నవత తెలిపిన వివరాల ప్రకారం చింతమడక గ్రామానికి చెందిన పెద్దగాని ప్రవీణ్ (32) నాటు వేసే మిషన్‌తో నాట్లు వేయడంతో పాటు వ్యవసాయ కూలీగా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. ఈ క్రమంలో కొద్దిరోజుల క్రితం అతని నాటు వేసే మిషన్ రిపేరుకు రావడంతో కూలి పనులకు వెళ్తున్నాడు. ప్రవీణ్ నూతనంగా ఇంటిని నిర్మిస్తుండగా, ఆ ఇల్లు నిర్మాణానికి, మిషన్ రిపేర్‌కు చేసిన అప్పులు ఎక్కువ అవడంతో వాటిని ఎలా తీర్చాలో తెలియక కొద్దిరోజులుగా మదనపడుతూ ఉన్నాడు. ఈ క్రమంలో అతని భార్య, పిల్లలు ఏకాదశి పండుగకు ఊరికి వెళ్లగా, అప్పుల విషయమై బాధపడుతూ ఉన్న ప్రవీణ్ సోమవారం రాత్రి ఇంట్లోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని చనిపోయినట్లు ఎస్సై తెలిపారు. మృతుడి భార్య నాగలక్ష్మి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.






