‘అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు!’.. సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Ramesh Naini |

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు.

‘అమరావతి అంటే 29 గ్రామాలు మాత్రమే కాదు!’.. సమీక్షలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణ పనులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని విస్తృతి, నిర్మాణ పనుల పురోగతిపై ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమరావతిని కేవలం 29 గ్రామాలకు మాత్రమే పరిమితమైన ప్రాంతంగా చూడకూడదని.. విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కూడా కలుపుకొని సమగ్ర రాజధానిగా చూడాలని స్పష్టం చేశారు.

‘స్పీడ్, క్వాలిటీ, డెలివరీ’ లక్ష్యం:

రాజధాని పనుల్లో 'స్పీడ్, క్వాలిటీ, డెలివరీ' (వేగం, నాణ్యత, సమయానికి పూర్తి చేయడం) ప్రధాన సూత్రాలుగా ఉండాలని అధికారులకు సీఎం నిర్దేశించారు. ప్రాజెక్టులన్నీ నిర్ణీత వ్యవధిలోనే పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అమరావతితో పాటు పరిసర ప్రాంతాల్లో రోడ్లు, నీటి సరఫరా, విద్యుత్ వంటి ప్రాథమిక మౌలిక వసతుల పనులను వేగవంతం చేయాలని స్పష్టం చేశారు. ఇకపై రాజధాని పరిధిలో జరుగుతున్న నిర్మాణ పనులను స్వయంగా తానే నేరుగా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తానని సీఎం ప్రకటించారు.

Next Story