- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీజీఎస్పీ 3వ బెటాలియన్‌కు అండగా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి
తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 3వ బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసి ఆగస్టు 3న నిర్వహించనున్న పలు అభివృద్ధి, క్రీడా కార్యక్రమాలకు ఆహ్వానించారు.

దిశ, ఇబ్రహీంపట్నం: తెలంగాణ స్పెషల్ పోలీస్ (టీజీఎస్పీ) 3వ బెటాలియన్ అధికారులు, సిబ్బంది ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డిని కలిసి ఆగస్టు 3న నిర్వహించనున్న పలు అభివృద్ధి, క్రీడా కార్యక్రమాలకు ఆహ్వానించారు. బెటాలియన్ కమాండెంట్ సయ్యద్ జమీల్ బాషా, అసిస్టెంట్ కమాండెంట్లు ఎం. వీరయ్య, ఆర్. పాండులు తదితరులు ఆదిబట్ల సర్కిల్ పరిధిలోని తొర్రూర్‌లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగన్‌పల్లి రోడ్డు నుంచి టీజీఎస్పీ 3వ బెటాలియన్ గేటు వరకు హెచ్‌ఎండీఏ నిధులతో, ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో నిర్మించిన అప్రోచ్ రోడ్డు ఇటీవల పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ రహదారి నిర్మాణంతో బెటాలియన్‌కు రాకపోకలు మరింత సులభతరమయ్యాయని పేర్కొంటూ ఎమ్మెల్యేకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ రోడ్డు ప్రారంభోత్సవాన్ని ఆగస్టు 3న ఎమ్మెల్యే చేతుల మీదుగా నిర్వహించాలని కోరారు.
అదే రోజు నుంచి ప్రారంభమయ్యే ఇంటర్నల్ బెటాలియన్ స్పోర్ట్స్ మీట్ ప్రారంభోత్సవాన్ని కూడా ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి చేతుల మీదుగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. బెటాలియన్‌లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించే దిశగా ఈ కార్యక్రమం ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ సమావేశంలో బెటాలియన్ అధికారులు హెచ్‌ఆర్‌ఏ (ఇంటి అద్దె భత్యం) పెంపు ఫైల్ అంశాన్ని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. గత డిసెంబర్‌లో గ్రేటర్ హైదరాబాద్ పరిధి విస్తరణ నేపథ్యంలో తమ బెటాలియన్ పెరిఫెరీ 8 కిలోమీటర్ల పరిధిలోకి వస్తున్నందున, కలెక్టర్ వద్ద పెండింగ్‌లో ఉన్న హెచ్‌ఆర్‌ఏ పెంపు ఫైల్‌ను త్వరితగతిన నోటిఫై చేయాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి ఫైల్ పురోగతిపై చర్చించినట్లు అధికారులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్లు రవీందర్, యుగేందర్, శేఖర్, యూనిట్ వైద్యాధికారి డాక్టర్ రవి, ఇతర బెటాలియన్ సిబ్బంది పాల్గొన్నారు.






