- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్బీఐ బ్యాంకులో రూ.15 వేల చోరీ
ఎస్‌బీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేసిన అనంతరం లెక్కపెడుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఉపాయంగా రూ.15 వేల నగదును అపహరించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.

దిశ, కామారెడ్డి: కామారెడ్డి పట్టణంలోని ఇంద్రనగర్ ఎస్‌బీఐ బ్యాంకులో డబ్బులు డ్రా చేసిన అనంతరం లెక్కపెడుతుండగా గుర్తుతెలియని వ్యక్తి ఉపాయంగా రూ.15 వేల నగదును అపహరించిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది.
సహాయం చేస్తున్నట్లు నటించి చోరీ..
పల్వంచ మండలం వాడి గ్రామానికి చెందిన చింతకింది పూజ, ఆమె తండ్రి పోచయ్య మంగళవారం ఉదయం సుమారు 10:30 గంటలకు ఇంద్రనగర్ ఎస్‌బీఐ శాఖకు వచ్చి తమ ఖాతా నుంచి రూ.50 వేల నగదు డ్రా చేశారు. అనంతరం బ్యాంకులోనే ఇద్దరూ కలిసి డబ్బులు లెక్కపెడుతుండగా, వారి పక్కనే కూర్చున్న గుర్తుతెలియని వ్యక్తి సహాయం చేస్తున్నట్లు నటించి పోచయ్య చేతిలోని నగదును తీసుకుని లెక్కపెట్టి తిరిగి ఇచ్చాడు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
రూ.15 వేల నగదు మాయం..
కొద్దిసేపటి తర్వాత పూజ, పోచయ్య మరోసారి నగదును లెక్కపెట్టగా రూ.15 వేల నగదు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. అప్పటికే ఆ వ్యక్తి బ్యాంకు నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
పోలీసులకు ఫిర్యాదు..
తమ దృష్టిని మళ్లించి నగదు అపహరించాడని బాధితురాలు పూజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వ్యక్తిని మళ్లీ చూస్తే గుర్తుపట్టగలనని ఆమె తెలిపారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
సీసీటీవీ ఫుటేజీ పరిశీలన..
ఈ ఘటనకు సంబంధించి బ్యాంకులోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నట్లు పట్టణ సీఐ నరహరి తెలిపారు. నిందితుడిని గుర్తించి త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు వెల్లడించారు.






