- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెండింగ్ వేతనాలు చెల్లించాలి.. ఎస్‌ఆర్‌డీఎస్, ఎఫ్‌టీఈ ఉద్యోగుల పోరుబాట
గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎస్‌ఆర్‌డీఎస్, (వీబీ జీ రాంజీ) ఎఫ్‌టీఈ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన బాట పట్టాలని నిర్ణయించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : గ్రామీణాభివృద్ధి శాఖ పరిధిలోని ఎస్‌ఆర్‌డీఎస్, (వీబీ జీ రాంజీ) ఎఫ్‌టీఈ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం నిరసన బాట పట్టాలని నిర్ణయించారు. 3 నెలలుగా వేతనాలు రాక తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తక్షణమే బకాయి జీతాలు విడుదల చేయాలని ఎస్‌ఆర్‌డీఎస్ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. 2026 ఆగస్టు 15 నాటికి నూతన హెచ్.ఆర్ పాలసీని అమలు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని, 3 నెలల వేతనాలను ఒకేసారి విడుదల చేయాలని, ప్రతి నెలా 1వ తేదీనే జీతాలు చెల్లించాలని, గ్రేడ్ పే, పదోన్నతులు, బడ్జెట్, ట్రావెల్ అలవెన్సుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని జేఏసీ డిమాండ్ చేసింది.
తమ డిమాండ్లను పరిష్కరించకపోతే దశలవారీగా నిరసనలకు దిగుతామని హెచ్చరించింది. ఆగస్టు 15 నాటికి ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన రాకపోతే, 16వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు, తీవ్రస్థాయిలో ఆందోళన చేపడతామని జేఏసీ చైర్మన్ బంద్రి లింగయ్య హెచ్చరించారు.






