ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు

by Ratna Kumari |

సర్వే నంబర్ 482లో ఉన్న ప్రభుత్వ భూమిని ఎవరూ ఆక్రమించరాదని రెవెన్యూ అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు.

ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు
X

దిశ, లింగంపేట : లింగంపేట మండలం రాంపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 482లో ఉన్న ప్రభుత్వ భూమిని ఎవరూ ఆక్రమించరాదని, ఆక్రమిస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ రెవెన్యూ అధికారులు మంగళవారం హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. ఇటీవల సర్వే నంబర్ 482లోని ప్రభుత్వ భూములను కొందరు వ్యక్తులు ఆక్రమిస్తున్నారని ఆరోపిస్తూ రాంపల్లి గ్రామస్థులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో స్పందించిన రెవెన్యూ అధికారులు సంబంధిత భూమిని సర్వే చేసి ప్రభుత్వ భూమిగా నిర్ధారించారు. తహసీల్దార్ సురేష్ ఆదేశాల మేరకు ప్రభుత్వ భూమిలో హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేసినట్లు మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జీపీఓ మాణిక్యం, సర్వేయర్ గోపి, రాంపల్లి గ్రామస్థులు పాల్గొన్నారు.

Next Story