కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలో ఉద్రిక్తత..

by Batti.Sumithra |

మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి న్యాయం చేయాలని ధర్నా చేసిన సంఘటన కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలో ఉద్రిక్తత..
X

దిశ, కొమురవెల్లి : మృతదేహాన్ని ఇంటి ముందు ఉంచి న్యాయం చేయాలని ధర్నా చేసిన సంఘటన కొమురవెల్లి మండలం తపస్పల్లి గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, ఎదురెదురుగా వచ్చిన రెండు బైక్‌లు గత 15 రోజుల క్రితం ఢీకొన్న ప్రమాదంలో సిద్దిపేట మండలం బొగ్గులోని కుంటకు చెందిన బైరి చార్లిస్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. హైదరాబాద్‌లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. చార్లిస్ మృతికి కొమురవెల్లి మండలం తపస్పల్లికి చెందిన రుద్రారం కనుకయ్య కారణమని ఆరోపిస్తూ, చార్లిస్ కుటుంబ సభ్యులు, బంధువులు మృతదేహాన్ని అతని ఇంటి ముందు ఉంచి ధర్నా నిర్వహించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని బైరి చార్లిస్ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో ధర్నా సద్దుమణిగింది.

Next Story