ఏజెన్సీలో గుడుంబాపై పోలీసుల ఉక్కుపాదం..

by Kodari Anjali |

ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

ఏజెన్సీలో గుడుంబాపై పోలీసుల ఉక్కుపాదం..
X

దిశ, కొత్తగూడ: ఏజెన్సీ ప్రాంతంలో అక్రమ గుడుంబా తయారీ, విక్రయాలను అరికట్టే చర్యల్లో భాగంగా మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం జంగాలపల్లి గ్రామంలో పోలీసులు మంగళవారం ఆకస్మిక దాడులు నిర్వహించారు. మహబూబాబాద్ జిల్లా ఎస్పీ ఆదేశాల అనుసరం గంగారం ఎస్సై కోటేశ్వరరావు ఆధ్వర్యంలో చేపట్టిన ఈ దాడుల్లో గుడుంబా తయారు చేస్తున్న నలుగురు వ్యక్తులను గుర్తించి, వారిపై సంబంధిత చట్టాల ప్రకారం కేసులు నమోదు చేశారు. గుడుంబా తయారీకి వినియోగిస్తున్న సామగ్రిని స్వాధీనం చేసుకుని ధ్వంసం చేసి ఈ సందర్భంగా ఎస్సై కోటేశ్వరరావు మాట్లాడుతూ.... ఏజెన్సీ ప్రాంతంలో గుడుంబా తయారీ, విక్రయాలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని ప్రజల ఆరోగ్యానికి హానికరమైన ఈ అక్రమ వ్యాపారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు నిరంతర దాడులు కొనసాగుతాయని గుడుంబా తయారీపై సమాచారం ఉన్నవారు పోలీసులకు తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని అన్నారు.ఈ కార్యక్రమం లో కానిస్టేబుల్ లు గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.

Next Story