భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య

by Kodari Anjali |

భర్త, అత్త, మామల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కెపిహెచ్బి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.

భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్య
X

దిశ, కూకట్​పల్లి: భర్త, అత్త, మామల వేధింపులు తట్టుకోలేక ఓ మహిళ ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కేపీహెచ్​బీ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ విజయ్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. మెదక్ జిల్లా కళాకళ్ గ్రామానికి చెందిన కంగిరి లలిత కూతురు హైమవతినీ హైదర్‌నగర్‌కు చెందిన శ్రీకాంత్‌తో 2019 లో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. వివాహం అనంతరం నుంచి శ్రీకాంత్ భార్య హైమవతిని వేధించడం ప్రారంభించాడు. శ్రీకాంత్ తో పాటు శ్రీకాంత్​ తల్లి లక్ష్మీ, తండ్రి శ్రీరాములు, ఆడపడుచు ధరణి, ఆడపడుచు భర్త దానయ్యలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని హైమావతి తన తల్లి తండ్రులకు 27వ తేదీ రాత్రి ఫోన్​ చేసి చెప్పింది. తనకు వారితో ప్రాణహాని ఉందని చెప్పింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం హైమావతి సోదరుడు గణేష్​ హైమావతిని కలిసేందుకు ఆమె ఇంటికి వెళ్లగా హైమవతి గది తలుపులు లోపలి నుంచి గడియ పెట్టుకుని తెరవడం లేదని చెప్పాడు. స్థానికుల సహాయంతో తలుపులు బద్దలు కొట్టగా, హైమావతి గదిలోని ఫ్యాన్​ హుక్కుకు ఉరివేసుకుని వేలాడుతూ కనిపించింది. తన కూతురు చావుకు భర్త, అత్త, మామ, ఆడపడుచు, ఆమె భర్తయే కారణం అంటూ హైమావతి తల్లి లలిత కేపీహెచ్​బీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. లలిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న కేపీహెచ్​బీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Next Story