- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
తొలి సమీక్ష సమావేశానికి సర్పంచుల డుమ్మా
తొలి సమీక్ష సమావేశానికి లింగంపేట మండలంలోని మెజారిటీ సర్పంచులు గైర్హాజరు కావడంతో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి సురేందర్ అసహనం వ్యక్తం చేశారు.

దిశ, లింగంపేట : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి పనులపై మంగళవారం నిర్వహించిన తొలి సమీక్ష సమావేశానికి లింగంపేట మండలంలోని మెజారిటీ సర్పంచులు గైర్హాజరు కావడంతో జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో, మండల ప్రత్యేక అధికారి సురేందర్ అసహనం వ్యక్తం చేశారు. మండలంలో మొత్తం 41 మంది సర్పంచులు ఉండగా కేవలం 19 మంది మాత్రమే సమావేశానికి హాజరయ్యారు. మిగిలిన 22 మంది సర్పంచులు సమావేశానికి డుమ్మా కొట్టడంతో సమావేశ మందిరంలో ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ప్రభుత్వ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులతో నిర్వహించిన తొలి సమీక్ష సమావేశానికే ఇంత తక్కువ హాజరు ఉండడంపై ప్రత్యేకాధికారి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా సర్పంచులకు సమావేశ సమాచారం ఇవ్వలేదా అని ఎంపీడీవో బ్రహ్మానందం, ఎంపీఓ మలహరిని ప్రత్యేకాధికారి ప్రశ్నించారు. దీనికి స్పందించిన ఎంపీడీవో, ఆయా గ్రామాల సర్పంచులను వెంట తీసుకుని సమావేశానికి రావాలని పంచాయతీ కార్యదర్శులకు ముందుగానే సూచించినట్లు తెలిపారు. మండలంలో ఉన్న 41 మంది సర్పంచుల్లో కనీసం సగం మంది కూడా సమావేశానికి హాజరు కాకపోవడం బాధాకరమని ప్రత్యేకాధికారి పేర్కొన్నారు. ఇకపై ఇటువంటి పరిస్థితి పునరావృతం కాకుండా చూడాలని, సమీక్ష సమావేశాలకు 100 శాతం సర్పంచులు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోను ఆదేశించారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పరస్పర సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతాయని సురేందర్ స్పష్టం చేశారు.






