నేలవాలిన వందకు పైగా వృక్షాలు.. ధృవీకరించిన ఫారెస్టు అధికారులు

by Kodari Anjali |

మండల కేంద్రం సమీపంలోని సండ్రోని ఒర్రె శాంతినగర్ గొత్తికోయగూడెం సమీపంలో సాయంత్రం 5 నుండి 5.30 గంటల మద్యలో వచ్చిన టోర్నడో బీభత్సం సృష్టించింది.

నేలవాలిన వందకు పైగా వృక్షాలు.. ధృవీకరించిన ఫారెస్టు అధికారులు
X

దిశ, మంగపేట: మండల కేంద్రం సమీపంలోని సండ్రోని ఒర్రె శాంతినగర్ గొత్తికోయగూడెం సమీపంలో సాయంత్రం 5 నుండి 5.30 గంటల మద్యలో వచ్చిన టోర్నడో బీభత్సం సృష్టించింది. అరగంట పాటు టోర్నడో చేసిన బీభత్సానికి సుమారు 150కి పైగా భారీ వృక్షాలు నేలవాలినట్లు ఫారెస్టు రేంజి అధికారి లాయక్ హుస్సేన్ తెలిపారు. సాయంత్రం వీచిన భారీ గాలులతో పాటు వర్ష బీభత్సం సృష్టించడంతో రోడ్డుపై చెట్లు విరగిపడ్డాయి. విషయాన్ని తెలుసుకున్న ఫారెస్టు అధఇకారులు ఘటనా స్థలానికి చేరుకుని టోర్నడో బీభత్సంలో విరిగిన చెట్లను గుర్తించే పనిలో ఉన్నట్లు తెలిపారు. రెండు సంవత్సరాల క్రితం మేడారం ప్రాంతంలో మొదటి సారి టోరన్నడో వచ్చి వేలాది వృక్షాలు నేలవాలిన విషయం తెలిసిందే. మళ్లీ ఇదే తరహా బీభత్సం మండల కేంద్రానికి సమీపంలో వచ్చి వందలాది వృక్షాలు నెలవాడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అదే టోర్నడో కూతవేటు దూరంలో ఉన్న మండల కేంద్రంలో వీస్తే ఆస్తి, ప్రాణ నష్టం భారీగా సంభవించేదంటూ ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.

Next Story