- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అప్పులు.. మద్యం.. చివరికి ఆత్మహత్య
మద్యానికి బాని సై, అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది.

దిశ, రాయపోల్ : మద్యానికి బాని సై, అప్పుల బాధతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి గడ్డి మందు తాగి, చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సిద్ధిపేట జిల్లా రాయపోల్ మండలం లింగారెడ్డిపల్లి గ్రామంలో సోమవారం వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన కుర్మ సంతోష్ (42) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిసై, గ్రామంలోని కొంతమంది వద్ద అప్పులు చేశాడు. దీంతో భార్య అనిత తరచూ ఎందుకు మద్యం తాగుతూ అప్పులు చేస్తున్నావు అంటూ మందలించేది.
ఈ క్రమంలో మనస్తాపానికి గురైన సంతోష్ ఆదివారం ఉదయం వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి గడ్డి మందు తాగాడు. అనంతరం ఇంటికి చేరుకుని వాంతులు చేసుకోవడంతో పాటు నోటి నుంచి నురగ రావడాన్ని గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే గజ్వేల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు రాయపోల్ ఎస్‌ఐ మానస తెలిపారు.






