జగిత్యాలలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్.

by Taduka Kalyani |

ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వ నిషేధిత గంజాయిని తెచ్చి జగిత్యాల పట్టణంలో విక్రయిస్తున్న నలుగురు యువకులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

జగిత్యాలలో గంజాయి విక్రయిస్తున్న నలుగురు యువకుల అరెస్ట్.
X

దిశ, జగిత్యాల టౌన్: ఇతర రాష్ట్రాల నుంచి ప్రభుత్వ నిషేధిత గంజాయిని తెచ్చి జగిత్యాల పట్టణంలో విక్రయిస్తున్న నలుగురు యువకులను టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, డీఎస్పీ పురుషోత్తం రెడ్డి పర్యవేక్షణలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో విశ్వసనీయ సమాచారం మేరకు జగిత్యాల టౌన్ ఎస్‌ఐ ఎం. సుప్రియ తమ సిబ్బందితో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలోని మోతె రోడ్డులో గల స్మశానవాటిక ఎదురుగా తనిఖీలు చేపట్టారు. అక్కడ అనుమానాస్పదంగా ఉన్న జవ్వాజి తేజ (20), గజ్జల అజయ్ (26), ఆలకుంట్ల గణేష్ (20), మరో మైనర్ బాలుడుని అదుపులోకి తీసుకుని విచారించగా, ఇతర రాష్ట్రాల నుంచి గంజాయి తెచ్చి విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారు. నిందితుల నుంచి 120 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని, వారిపై కేసు నమోదు చేసినట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. కరుణాకర్ తెలిపారు. మాదకద్రవ్యాల విక్రయం, వినియోగంపై సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని, సమాచారాన్ని గోప్యంగా ఉంచుతామని ఇన్‌స్పెక్టర్ కోరారు.

Next Story