దివ్యాంగ యువకుడు అదృశ్యం..

by Batti.Sumithra |

మాసాయిపేట మండలం నడమితాండ గ్రామపంచాయతీ పరిధిలోని వెనుక తాండకు చెందిన ఓ దివ్యాంగ యువకుడు అదృశ్యమైన ఘటనపై చేగుంట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

దివ్యాంగ యువకుడు అదృశ్యం..
X

దిశ, చేగుంట : మాసాయిపేట మండలం నడమితాండ గ్రామపంచాయతీ పరిధిలోని వెనుక తాండకు చెందిన ఓ దివ్యాంగ యువకుడు అదృశ్యమైన ఘటనపై చేగుంట పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల వివరాల ప్రకారం వెనుక తాండకు చెందిన మాలోత్ చింటూ (19) పుట్టుకతోనే మూగ, చెవిటి కాగా, మానసిక వైకల్యంతో బాధపడుతున్నాడు. ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటల సమయంలో గ్రామానికి వచ్చిన ఐడియల్ స్కూల్ బస్సులో ఎక్కి పెద్ద శివునూర్ బస్‌స్టాప్ వద్ద దిగిన చింటూ అనంతరం కనిపించకుండా పోయాడు. ఈ విషయమై యువకుడి తండ్రి మాలోత్ కిమ్య మంగళవారం చేగుంట పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, ఎస్‌ఐ భీక్య నాయక్ మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. చింటూ ఆచూకీ తెలిసిన వారు వెంటనే చేగుంట ఎస్‌ఐ భీక్య నాయక్‌ను 8712581724 నంబర్‌లో సంప్రదించాలని పోలీసులు కోరారు.

Next Story