పిడుగుపాటుకు మూడు ఇళ్లలో కాలిపోయిన ఫ్యాన్లు, ఇన్వర్టర్

by Kodari Anjali |

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పట్టణంలో పెను ప్రమాదం తప్పింది.

పిడుగుపాటుకు మూడు ఇళ్లలో కాలిపోయిన ఫ్యాన్లు, ఇన్వర్టర్
X

దిశ, ఘట్కేసర్: మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ఘట్కేసర్ పట్టణంలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం సాయంత్రం బాలాజీ నగర్‌లో పిడుగు పడింది. వర్షం కురిసే ముందు బాలాజీ నగర్ (గాంధీ నగర్) లో భారీ శబ్ధంతో తాటి చెట్టుపై పిడుగు పడింది. పిడుగు పాటుకు రాజేందర్, గుర్రం ఈశ్వర్, డిసూజ ఇంట్లో రూ.50 వేలు, విలువైన 10 సీలింగ్ ఫ్యాన్లు, స్విచ్ బోర్డులు, ఇన్వర్టర్, తగలబడ్డాయి. ఇంటర్నెట్ కేబుల్ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. కానీ ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు.

Next Story