- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ట్రాక్టర్ పై ప్రయాణించిన ఎమ్మెల్సీ
పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో గత కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు.

దిశ, బెజ్జూర్ : పెంచికలపేట మండలం పోతేపల్లి గ్రామ శివారులో గత కొన్ని సంవత్సరాలుగా పోడు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న గిరిజన రైతులను అటవీ అధికారులు ఇబ్బందులకు గురిచేస్తున్న నేపథ్యంలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఎమ్మెల్సీ దండే విఠల్ అన్నారు. మంగళవారం పెంచికలపేట మండలం పోతే పెళ్లి గ్రామానికి ఎమ్మెల్సీ దండ విట్టల్ ట్రాక్టర్ పై ప్రయాణించారు. రైతులతో కలిసి పరిస్థితిని పరిశీలించారు. అనంతరం అటవీ, రెవెన్యూ అధికారులతో ప్రత్యక్షంగా చర్చలు జరిపిన ఎమ్మెల్సీ దండే విఠల్ తరతరాలుగా సాగు చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న గిరిజనుల హక్కులను కాలరాసే విధంగా ఎలాంటి చర్యలు చేపట్టరాదని అధికారులను హెచ్చరించారు.
గిరిజనుల జీవనాధారమైన పోడు భూముల విషయంలో అధికారులు మానవతా దృక్పథంతో వ్యవహరించాలని, రైతులను బెదిరించడం, వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడం తగదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దండే విఠల్ మాట్లాడుతూ గిరిజనుల హక్కులను కాపాడటం కాంగ్రెస్ ప్రభుత్వ బాధ్యత. గిరిజనుల భూముల జోలికి వస్తే ఊరుకునేది లేదు. వారి సమస్యల పరిష్కారం కోసం అవసరమైతే ఏ స్థాయిలోనైనా పోరాటం చేస్తాం. పోడు రైతులకు ఎల్లప్పుడూ అండగా నిలుస్తాం అని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ జోక్యంతో అధికారులు సానుకూలంగా స్పందించి, గిరిజన రైతులు తమ పోడు భూముల్లో వ్యవసాయం కొనసాగించేలా చర్యలు తీసుకోవడంతో రైతులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, గిరిజన రైతులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






