బాధితురాలి ఫిర్యాదుతో కీలక పరిణామం.. ఇన్స్పెక్టర్ సస్పెండ్

by Taduka Kalyani |

హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కీలక జోన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ ఇన్స్ పెక్టర్ గలీజు వ్యవహారం కలకలం రేపుతోంది.

బాధితురాలి ఫిర్యాదుతో కీలక పరిణామం..  ఇన్స్పెక్టర్ సస్పెండ్
X

దిశ, సిటీక్రైం : హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కీలక జోన్ పరిధిలోని ఓ పోలీసు స్టేషన్ ఇన్స్ పెక్టర్ గలీజు వ్యవహారం కలకలం రేపుతోంది. మంగళవారం ఈ వ్యవహారం వెలుగులోకి రావడంతో నగర పోలీసు శాఖను కలవరానికి గురిచేసింది. బాధితురాలు ఫిర్యాదు వివరాలు ప్రకారం..2021 సంవత్సరంలో బీరంగూడలో నివాసం ఉంటున్న ఓ వివాహిత తన ఇంట్లోని గొడవలకు సంబంధించి అమీన్ పూర్ పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదు దర్యాప్తు చేసిన ఇన్స్ పెక్టర్ మీకు అన్యాయం జరిగింది అంటూ పరిచయం పెంచుకుని ఆమెకు దగ్గరవడానికి ప్రయత్నించాడు. ఇన్స్ పెక్టర్ పలు మార్లు ఆమెకు ఇంటికి వచ్చినప్పుడు దూరంగా ప్రయత్నించినా నేను పోలీసంటూ భయపెట్టడంతో బాధితురాలు ఏం చేయలేక నిస్సహాయకురాలిగా ఉండిపోయింది. దీనిని అవకాశంగా మార్చుకుని ఇన్స్ పెక్టర్ ఆమెను తన ఇంటికి పిలిపించి అసభ్యంగా ప్రవర్తించాడు. ఈ ప్రవర్తనను బాధితురాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పుడల్లా తాను పోలీసు అంటూ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతే కాకుండా రహస్యంగా అబార్షన్ కూడా చేయించాడని బాధితురాలు ఫిర్యాదులో పేర్కొంది. ఇలా అమీన్ పూర్ నుంచి తాజాగా హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ కు బదిలీ అయ్యి కీలక పోలీసు స్టేషన్ కు ఇన్స్ పెక్టర్ గా వచ్చిన తర్వాత కూడా అతను నిరంతరం వేధిస్తుండడం తాను పిలిచినప్పుడల్లా రావాలని బెదిరిస్తుండడంతో బాధితురాలు అతని బెదిరింపులకు బందీ అయ్యిందని ఫిర్యాదులో వివరించింది.
లైంగిక దాడికి పాల్పడి ఆ వీడియోలు బయటపెడతానని బెదిరిస్తు డబ్బులు కావాలని లక్షలాది రూపాయాలను వసూలు చేశాడని బాధితురాలు ఫిర్యాదులో వివరించింది. ఇలా ఐదు సంవత్సరాల పాటు నిరంతరం వేధింపులకు గురవుతున్న బాధితురాలు పలుమార్లు ఉన్నతాధికారులను కలవడానికి ప్రయత్నించినా ఇతర అధికారుల సహాయంతో అడ్డుకున్నాడని బాధితురాలు ఫిర్యాదులో స్పష్టం చేసింది. ఈ నేపధ్యంలో తనను ఇన్స్ పెక్టర్ వేధింపుల నుంచి కాపాడాలని కోరుతూ ఇటీవల డీజీపీ ని కలిసి రాతపూర్వకంగా ఫిర్యాదును ఇచ్చారు. ఇన్స్ పెక్టర్ అబార్షన్ చేయించిన ఆసుపత్రి వివరాలు, అతనికి బదిలీ చేసిన లక్షల రూపాయాల లావాదేవిల వివరాలను బాధితురాలు ఉన్నతాధికారులకు అందించింది. ఈ ఫిర్యాదు పై ఉన్నతాధికారులు విచారణ జరిపారు....

జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ సస్పెండ్ --


బాధితురాలు ఫిర్యాదు పై దర్యాప్తు చేసిన పోలీసు ఉన్నతా ధికారులు జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ని రెండు రోజుల కిందట పోలీస్ కమిషనర్ కార్యాలయానికి అటాచ్ చేసారు.. దర్యాప్తు పూర్తవడం తో మంగళవారం పోలీస్ కమిషనర్ సజ్జనార్ సస్పెండ్ చేసారు.

Next Story