- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఇంటింటికీ వెళ్లి విద్యార్థులను బడిబాట పట్టించిన ఉపాధ్యాయుడు
చిన్న చిన్న కారణాలతో పాఠశాలకు హాజరు కాకుండా ఇంటి వద్దే ఉంటున్న విద్యార్థులను తిరిగి బడిబాట పట్టించేందుకు నాంపల్లి మండలం దామెర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గురిజ మహేష్ వినూత్న కార్యక్రమం చేపట్టారు.

దిశ, నాంపల్లి : చిన్న చిన్న కారణాలతో పాఠశాలకు హాజరు కాకుండా ఇంటి వద్దే ఉంటున్న విద్యార్థులను తిరిగి బడిబాట పట్టించేందుకు నాంపల్లి మండలం దామెర గ్రామంలోని మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు గురిజ మహేష్ వినూత్న కార్యక్రమం చేపట్టారు. పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థుల ఇళ్లకు స్వయంగా వెళ్లిన ఆయన, విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులను కలిసి ప్రతిరోజూ పాఠశాలకు హాజరుకావడం వల్ల కలిగే విద్యా, వ్యక్తిత్వ వికాస ప్రయోజనాలను వివరించారు. చిన్న చిన్న కారణాలతో తరచూ పాఠశాలకు దూరంగా ఉంటే చదువులో వెనుకబడటమే కాకుండా పాఠాలు అర్థం కాకపోవడం, పరీక్షల్లో ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడం వంటి ఇబ్బందులు ఎదురవుతాయని అవగాహన కల్పించారు.
తమ పిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని వారిని ప్రతిరోజూ పాఠశాలకు పంపాలని తల్లిదండ్రులను కోరడంతో పాటు, గైర్హాజరవుతున్న విద్యార్థులను తనతో పాటు పాఠశాలకు తీసుకువచ్చారు. ఉపాధ్యాయుడు గురిజ మహేష్ చేపట్టిన ఈ కార్యక్రమాన్ని గ్రామస్థులు, తల్లిదండ్రులు అభినందించారు. విద్యార్థుల హాజరు శాతం పెరగడంతో పాటు చదువుపై ఆసక్తి పెంపొందించడంలో ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయని అభిప్రాయపడ్డారు.






