రేపటితో ముగియనున్న ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ దరఖాస్తుల గడువు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2026 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు రెపటితో ముగియనుంది.

రేపటితో ముగియనున్న ఇన్ సర్వీస్ టీచర్ల టెట్ దరఖాస్తుల గడువు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్-2026 కు సంబంధించిన ఆన్‌లైన్ దరఖాస్తుల గడువు రెపటితో ముగియనుంది. ఇప్పటివరకు రెండు పేపర్లలో కలిపి 16,042 మంది ధరఖాస్తు చేసుకున్నట్లు టెట్ కన్వీనర్ జి. రమేష్ ఒక ప్రకటనలో తెలిపారు. ధరఖాస్తుల్లో తప్పులను సరిదిద్దుకునేందుకు ఈ నెల 30 వరకు ఎడిట్ ఆప్షన్ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. అధికారిక వెబ్‌సైట్ https://schooledu.telangana.gov.in ద్వారా ఉపాధ్యాయులు తమ దరఖాస్తుల్లో అవసరమైన మార్పులు, చేర్పులు చేసుకోవచ్చని వెల్లడించారు. పేపర్1 లో 1,705 పేపర్2 లో 11,634 రెండు పేపర్లు కలిపి 2,703 ధరఖాస్తు చేసుకోగా, మంగళవారం మధ్యాహ్నం నాటికి 16,042 ధరఖాస్తులు అందాయి. ఇప్పటికే దరఖాస్తు చేసినవారు తమ వివరాల్లో ఏదైనా సవరణలు ఉంటే జులై 30 సాయంత్రంలోగా ఎడిట్ చేసుకోవచ్చు.

Next Story