- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలి
ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు.

దిశ, రాజాపేట: ఎల్ నినో ప్రభావంతో వర్షపాతం గణనీయంగా తగ్గిన నేపథ్యంలో నీటి లభ్యతను బట్టి పంటలు ఎంపిక చేసుకోవాలని, రైతులు ముందస్తు ప్రణాళికతో ప్రత్యామ్నాయ పంటలు సాగు చేపట్టాలని యాదాద్రి భువనగిరి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు తెలిపారు. మంగళవారం రాజా పేట మండలం లో ఏర్పాటు చేసిన రైతు వేదికలో నిర్వహించిన కార్యక్రమంలో అదనపు కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ వాతావరణం పరిస్థితులకు అనుగుణంగా పంటలు వేయాలని రైతులకు అవగాహన కల్పించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగిస్తూ, నీటి అవసరం ఉన్న ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు. నీటి లభ్యత బట్టి పంటలను ఎంపిక చేసుకోవాలని అన్నారు. రైతులు సంప్రదాయ పంటలపైనే ఆధారపడకుండా జొన్నలు, పెసలు, మినుములు, కంది ఆముదం వంటి పంటలపై దృష్టి సారించి, వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా లాభదాయకమైన పంటలను ఎంచుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో యాదగిరిగుట్ట ఏడిఏ పద్మజ, ఆలేరు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ సిల్వేరు బాలరాజు గౌడ్, రేణికుంట పిఎసిఎస్ చైర్మన్ నమిల మహేందర్ గౌడ్, ఎంపీడీవో నాగవేణి, పిఎసిఎస్ డైరెక్టర్లు, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చిగుళ్ల లింగం, దావూద్ ఎవరు పట్టుకున్నారు రాజపేట పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఐరేని నవీన్ కుమార్, ఏఈఓ లు అంజయ్య, ప్రిణీత, నవ్యత, భవ్యత, రైతులు పాల్గొన్నారు.






