- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠాలు బోధిస్తున్నారా.. లేదా..?
టీచర్ డైరీ రాయకుండా టీచర్ డ్యూటీ చేస్తున్నారా అని జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు.

దిశ, సిద్దిపేట ప్రతినిధి : టీచర్ డైరీ రాయకుండా టీచర్ డ్యూటీ చేస్తున్నారా అని జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని మల్టీ పర్పస్ హైస్కూల్ ను జిల్లా కలెక్టర్ కే హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ఉపాధ్యాయుల పని తీరును క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. అటెండెన్స్ రిజిస్టర్ ను వెరిఫై చేశారు. రిజిస్టర్ లో సంతకం చేయకుండా మధ్యాహ్న సమయంలో పలువురు ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లడం పై అసహనం వ్యక్తం చేశారు. రోజు ఇలానే చేస్తున్నారా అని పాఠశాల ప్రిన్సిపాల్ ను ఆరా తీశారు. అనంతరం టీచర్ డైరీ తనిఖీ చేశారు. టీచర్ డైరీ రాయకుండా టీచర్ డ్యూటీ చేస్తున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఉపాధ్యాయులను చూస్తుంటే విద్యార్థులకు పాఠాలు సక్రమంగా బోధిస్తున్నారా అని తరగతి గదిలోకి వెళ్లిన జిల్లా కలెక్టర్ హైమావతి విద్యార్థులను తీశారు. ప్రిన్సిపాల్ కు ఉపాధ్యాయులు, మిగతా సిబ్బంది వినకుండా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న తీరు విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా ఉందని డీఈఓ రమేశ్ కు ఫోన్ చేసి పాఠశాల పై, ఉపాధ్యాయులు పనితీరు, విద్యార్థులకు బోధించే పాఠ్యాంశాల గూర్చి విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ హైమావతి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వృత్తి విలువలు, వృత్తి ధర్మాన్ని కాపాడాలన్నారు. ఉపాధ్యాయుల విధుల్లో అశ్రద్ధ అంటే, విద్యార్థుల విద్య, భద్రత, పాఠశాల నిర్వహణ, తమ అధికారిక బాధ్యతలను నిర్లక్ష్యం చేయడమే అన్నారు. డీఈఓ సూచన మేరకు పాఠశాలకు చేరుకున్న సెక్టోరియల్ అధికారి రామస్వామి విద్య సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యాంశ బోధన, ఉపాధ్యాయుల పని తీరు, టీచర్ డైరీ, లెసన్ ప్లాన్ తదితర అంశాల పై విచారణ చేపట్టారు.






