- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'జలసిరి'ని ఛాలెంజ్‌గా తీసుకుని విజయవంతం చేయాలి
'జలసిరి' పథకాన్ని మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సవాల్‌గా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో, లింగంపేట మండల ప్రత్యేక అధికారి సురేందర్ అన్నారు.

దిశ, లింగంపేట : రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న 'జలసిరి' పథకాన్ని మండలంలోని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సవాల్‌గా తీసుకుని విజయవంతం చేయాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈవో, లింగంపేట మండల ప్రత్యేక అధికారి సురేందర్ అన్నారు. మంగళవారం స్థానిక ఐకేపీ కార్యాలయ సమావేశ మందిరంలో సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో అభివృద్ధి పనులపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా సురేందర్ మాట్లాడుతూ.. ఎల్‌నీనో ప్రభావంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనే అవకాశం ఉన్నందున ముందస్తు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఇంటి వద్ద ఇంకుడు గుంతలు, మ్యాజిక్ సోక్‌పిట్లు, ప్రతి గ్రామంలో ఫామ్‌పాండ్లు, ఊటకుంటలు, కమ్యూనిటీ సోక్‌పిట్లు, బోరుబావుల రీఛార్జ్ నిర్మాణాలు చేపట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని సూచించారు. భవిష్యత్తులో సాగు, తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా చేయడమే జలసిరి పథకం ప్రధాన లక్ష్యమని వివరించారు.
జలసిరి పథకంపై రైతులు, గ్రామీణ ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించి ప్రతి గ్రామంలో విజయవంతంగా అమలు చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులకు సూచించారు. ఇందిరమ్మ గృహ నిర్మాణాలు, ఉపాధి హామీ పథకం, డ్వాక్రా మహిళలకు ఉపాధి కల్పనలో లింగంపేట మండలం కామారెడ్డి జిల్లాలో అగ్రస్థానంలో ఉందని, అదే స్ఫూర్తితో జలసిరి అమలులో కూడా జిల్లా వ్యాప్తంగా మొదటి స్థానంలో నిలిచేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు, గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై ప్రతి 45 రోజులకు ఒకసారి సమీక్ష సమావేశాలు నిర్వహించి పురోగతిని పరిశీలిస్తామని తెలిపారు. ఈ సమావేశంలో ఎంపీడీవో బ్రహ్మానందం, తహసీల్దార్ సురేష్, ఏపీఎం వినోద్, ఏపీఓ నరేందర్, పీహెచ్‌సీ వైద్యురాలు డాక్టర్ హిమబిందు, మండల వ్యవసాయ అధికారి అనిల్ కుమార్, వెటర్నరీ వైద్యుడు డాక్టర్ హన్న జోనస్, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాస్కర్, హౌసింగ్ ఏఈ సృజన్ రెడ్డి, నీటిపారుదల శాఖ ఏఐ సతీష్, ట్రాన్స్‌కో ఏఈ హరీష్ రావు, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.






