- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అమెరికాలో రోడ్డు ప్రమాదం.. ఆమనగల్లు వాసి మృతి
by Batti.Sumithra |
ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు.

X
దిశ, ఆమనగల్లు : ఆమనగల్లు మండలం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన శ్రీపాతి దీపారెడ్డి (44) అమెరికాలోని న్యూజెర్సీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది. మాడ్గుల మండల కేంద్రానికి చెందిన పట్టాభి శేఖర్ రెడ్డి, శశిరేఖ దంపతుల కుమార్తె అయిన దీపారెడ్డికి 20 ఏళ్ల క్రితం ఆకుతోటపల్లి గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డితో వివాహమైంది. దంపతులిద్దరూ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా పనిచేస్తూ న్యూజెర్సీలో స్థిరపడ్డారు. సిగ్నల్ వద్ద ఆమె ప్రయాణిస్తున్న కారు ఆగి ఉండగా, మరో కారు వేగంగా వచ్చి ఢీ కొట్టడంతో తీవ్రగాయాలపాలై ప్రాణాలు కోల్పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీపారెడ్డికి సంస్కృత, హర్షిత అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆమె మృతితో కుటుంబ సభ్యులు, బంధువులు, స్వగ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.
Next Story






