- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎయిరిండియా విమాన ప్రమాదం.. ఫైనల్ రిపోర్టుపై AAIB బిగ్ స్టేట్‌మెంట్
అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన ప్రమాదంపై మరో కీలక అప్‌డేట్ బయటకు వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా (AI-171) బోయింగ్ ఎక్స్‌ప్రెస్ విమాన ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలోనే విమాన ప్రమాదాల దర్యాప్తు సంస్థ (AAIB) కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి తుది నివేదికను అందజేస్తామని సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఎదుట దర్యాప్తు ఏఏఐబీ వివరాలను వెల్లడించింది. అయితే, ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలను తెలుసుకునేందుకు అన్ని కోణాల్లో లోతైన పరిశోధన జరుగుతోందని, నివేదికను పూర్తి చేయడానికి అక్టోబర్ వరకు సమయం పడుతుందని కోర్టుకు వివరించింది. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబ సభ్యులు, బాధితులకు న్యాయం జరగడానికి, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా ప్రమాణాలను రూపొందించడానికి ఈ తుది నివేదిక అత్యంత కీలకమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇచ్చిన గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి సమగ్ర నివేదికను సమర్పించాలని ఆదేశించింది.






