బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వ్యక్తులకు పోలీస్ స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు ఆదేశం

by Kodari Anjali |

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి హెచ్చరించారు.

బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన వ్యక్తులకు పోలీస్ స్టేషన్  పరిసరాలను శుభ్రం చేయాలని కోర్టు ఆదేశం
X

దిశ, మేడిపల్లి: బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తూ ప్రజలకు ఇబ్బందులు కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మేడిపల్లి సీఐ జలేందర్ రెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా చెంగిచెర్ల–బోడుప్పల్ ప్రాంతంలో మద్యం సేవిస్తూ న్యూసెన్స్‌కు పాల్పడిన ఐదుగురిపై మేడిపల్లి పోలీసులు పెటీ కేసు నమోదు చేసి, ఎల్‌బీనగర్‌లోని మొదటి ప్రత్యేక రెండో తరగతి న్యాయ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు. కోర్టు నిందితులకు ఒక్కొక్కరికి రూ.50 చొప్పున మొత్తం రూ.250 జరిమానా విధించడంతో పాటు, 'స్వచ్ఛ భారత్' కార్యక్రమంలో భాగంగా పోలీస్ స్టేషన్, కోర్టు పరిసరాలను శుభ్రం చేయాలని ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు వారు పరిశుభ్రత కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కేసులో తుక్కుగూడకు చెందిన తరుణ్ (24), రాచ క్రాంతి కుమార్ (24), ప్రవీణ్ (24), బోడుప్పల్‌కు చెందిన తరుణ్ (21), నవీన్ (23) ఉన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించి న్యూసెన్స్‌కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తప్పవని సీఐ జలేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story