నల్లకుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..

by Taduka Kalyani |

నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద డిగ్రీ కాలేజీ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది.

నల్లకుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతి..
X

దిశ, సికింద్రాబాద్: నల్లకుంట పోలీస్ స్టేషన్ పరిధిలోని వివేకానంద డిగ్రీ కాలేజీ సమీపంలో ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. సోమవారం మధ్యాహ్నం సుమారు 2:00 గంటల సమయంలో సుమారు 50 ఏళ్ల వయస్సు గల ఓ వ్యక్తి కదలలేని స్థితిలో రోడ్డుపై పడి ఉండగా స్థానికులు గుర్తించారు. సమాచారం అందుకున్న నల్లకుంట పోలీసులు వెంటనే 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న వైద్య సిబ్బంది పరీక్షించి, అప్పటికే ఆ వ్యక్తి మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడు పీచ్ రంగు గీతలతో కూడిన లీఫ్ డిజైన్ షర్ట్, క్రీమ్ కలర్ ప్యాంట్ ధరించి ఉన్నాడు. ఈ వ్యక్తి వివరాలు ఎవరికైనా తెలిసినట్లయితే వెంటనే నల్లకుంట పోలీస్ స్టేషన్ ను సంప్రదించి సమాచారం అందించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Next Story