- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రతి కుటుంబానికి డిజిటల్ గుర్తింపు! ఫ్యామిలీ రిజిస్టర్ ఎలా దరఖాస్తు చేయాలంటే..?
రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో ఎలక్ట్రానిక్ కుటుంబ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ ఫ్యామిలీ రిజిస్టర్ ఎలా దరఖాస్తు చేయాలో ఇక్కడ తెలుసుకోండి.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా తెలంగాణ ఫ్యామిలీ రిజిస్టర్ పేరుతో ఎలక్ట్రానిక్ కుటుంబ రిజిస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కుటుంబ సభ్యుల వివరాలను ఒకే డిజిటల్ రికార్డులో నమోదు చేసి, అవసరమైన సందర్భాల్లో మీ సేవ కేంద్రాల ద్వారా ఫ్యామిలీ రిజిస్టర్ సర్టిఫికెట్ జారీ చేసే విధానాన్ని అమల్లోకి తీసుకురానుంది. ఈ రిజిస్టర్‌లో కుటుంబానికి సంబంధించిన పూర్తి వివరాలు నమోదు చేయనున్నారు. కుటుంబ రేషన్ కార్డు నంబర్‌ను ఫ్యామిలీ రిజిస్టర్ ఐడీగా పరిగణించనుండగా, కుటుంబ పెద్ద పేరు, ప్రతి సభ్యుడి పేరు, కుటుంబ పెద్దతో సంబంధం, వయస్సు, జనన తేదీ, లింగం, ఆధార్ నంబర్‌తోపాటు పూర్తి చిరునామా వంటి వివరాలు ఇందులో పొందుపరుస్తారు. ఈ సమాచారాన్ని ఫుడ్ సెక్యూరిటీ కార్డు (రేషన్ కార్డు) డేటాబేస్ నుంచి సేకరించి ఎలక్ట్రానిక్ రూపంలో నమోదు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు జీవో 172 జారీ చేశారు. కాగా, ఫ్యామిలీ రిజిస్టర్ దరఖాస్తు చేసే విధానం, మరింత సమాచారం వీడియోలో చూడండి.






