- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ఐదుగురికి జైలు
డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదులో ప్రత్యేకతను చాటుకుంటున్నారు గుమ్మడిదల పోలీసులు.

దిశ, జిన్నారం : డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల నమోదులో ప్రత్యేకతను చాటుకుంటున్నారు గుమ్మడిదల పోలీసులు. నెలలో నిర్వహించిన ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 11 మందిని గుర్తించి కేసులు నమోదు చేశారు. జిన్నారం జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరచగా, కేసును విచారించిన న్యాయమూర్తి తేజస్వి ప్రతి ఒక్కరికీ రూ.2,000 చొప్పున జరిమానా విధించడంతో పాటు, వారిలో ఐదుగురికి ఒక రోజు సాధారణ జైలు శిక్షను ఖరారు చేసినట్లు గుమ్మడిదల ఎస్‌ఐ అరుణ్‌కుమార్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల అమాయకుల ప్రాణాలు ప్రమాదంలో పడటమే కాకుండా, డ్రైవర్ జీవితం కూడా ఇబ్బందుల్లో పడుతుందని ఎస్‌ఐ అరుణ్‌కుమార్ హెచ్చరించారు. మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలు పాటించి సురక్షితంగా ప్రయాణం చేయాలని సూచించారు.






