బిఈడీ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ మార్పు

by Muthe.Rajitha |

రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ ఎల్. పాండురంగా రెడ్డి సవరించారు.

బిఈడీ మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్ మార్పు
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో బీఈడీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత కౌన్సెలింగ్ షెడ్యూల్‌ను కన్వీనర్ ప్రొఫెసర్ ఎల్. పాండురంగా రెడ్డి సవరించారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, సర్టిఫికేట్ల అప్‌లోడ్ గడువును ఆగస్టు 3 వరకు పొడిగిస్తున్నట్లు ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. సవరించిన షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 6 వరకు అర్హులైన అభ్యర్థుల జాబితా ప్రదర్శన, సవరణలకు అవకాశం కల్పించారు. ఆగస్టు 7 నుండి 10 వరకు వెబ్ వెబ్ ఆప్షన్ల నమోదు, ఆగస్టు 11న వెబ్ ఆప్షన్ల సవరణ, ఆగస్టు 16న సీట్ల కేటాయింపు, ఆగస్టు 17 నుండి 20 వరకు కాలేజీల్లో ఒరిజినల్ సర్టిఫికెట్లతో రిపోర్టింగ్ కు అవకాశం కల్పించారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు పూర్తి వివరాలకు అధికారిక వెబ్ సైట్ ను సంప్రదించాలని కన్వీనర్ సూచించారు.

Next Story