రెడీ టూ సర్వ్ ఫౌండేషన్‌లో పావలా శ్యామల భౌతికకాయం..

by Taduka Kalyani |

ప్రముఖ సీనియర్ సినీ నటి పావలా శ్యామల (75) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు.

రెడీ టూ సర్వ్ ఫౌండేషన్‌లో పావలా శ్యామల భౌతికకాయం..
X

దిశ, హస్తినాపురం, జూలై 28: ప్రముఖ సీనియర్ సినీ నటి పావలా శ్యామల (75) మంగళవారం తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె తుదిశ్వాస విడిచారు. ఆమె మరణంతో తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. నటి కరాటే కల్యాణి, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రధాన కార్యదర్శి రఘుబాబు తదితర సినీ ప్రముఖులు ఆమె భౌతికకాయానికి నివాళులర్పించారు. ప్రస్తుతం పావలా శ్యామల పార్థివదేహాన్ని వనస్థలిపురంలోని రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ ఫ్రీ ఓల్డ్ ఏజ్ హోమ్‌కు తరలించారు. అభిమానులు, సినీ ప్రముఖులు, బంధువులు తుది నివాళులు అర్పించేందుకు అక్కడ ఏర్పాటు చేశారు. జూలై 28 మధ్యాహ్నం 3 గంటల నుంచి జూలై 29 మధ్యాహ్నం 12 గంటల వరకు ప్రజల సందర్శనార్థం పార్థివదేహాన్ని ఫౌండేషన్‌లో ఉంచనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అనంతరం సాహెబ్‌నగర్‌లోని స్థానిక స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ బాధ్యతగా చేపట్టింది. మరిన్ని వివరాల కోసం ఫౌండేషన్ నిర్వాహకుడు పెద్ది శంకర్ (97012 95527) ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు.

'రెడీ టూ సర్వ్ ఫౌండేషన్ లోకేషన్ :

https://maps.app.goo.gl/.

Next Story