- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సాంకేతిక పరిజ్ఞానంతో లొకేషన్ ట్రేస్ చేసి ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసు సిబ్బంది
ఆత్మహత్యాయత్నాన్ని అడ్డుకున్న పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.జానకి అభినందించారు.

దిశ, రాజాపూర్: రాజాపూర్ మండల కేంద్రానికి చెందిన టంకరి రాజేష్ కుటుంబ కలహాల కారణంగా 28 వ తేదీ నాడు సుమారు 1గంట సమయంలో ఇంటి నుండి వెళ్లిపోయి తన భార్యకు ఫోన్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పాడు. దీంతో ఆందోళనకు గురైన అతని భార్య తన ఇద్దరు చిన్న పిల్లలతో కంగారుగా వెతుకుతుండగా, పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పీసీ-1170 సత్యనారాయణ గౌడ్ ఆమెను గమనించి వివరాలు తెలుసుకున్నారు. వెంటనే ఆమె వద్ద నుంచి రాజేష్ మొబైల్ నంబర్ సేకరించి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా అతని లొకేషన్‌ను గుర్తించారు. అనంతరం పెట్రోలింగ్ సిబ్బంది అయిన పీసీ-1170 సత్యనారాయణ గౌడ్, హోంగార్డ్-639 ఖాజా ఖలీముద్దీన్ మరియు పెట్రోల్ మొబైల్ హోంగార్డ్-665 డ్రైవర్ నరేందర్ తక్షణమే సంఘటనా స్థలానికి చేరుకుని రైల్వే పట్టాలపై ఆత్మహత్యకు ప్రయత్నిస్తున్న రాజేష్‌ను సురక్షితంగా కాపాడి, కౌన్సెలింగ్ అనంతరం అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. సమయస్ఫూర్తితో స్పందించి ఒక వ్యక్తి ప్రాణాలను కాపాడిన రాజాపూర్ పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ డి.జానకి, ఐపీఎస్ అభినందిస్తూ, ఇలాంటి మానవతా దృక్పథంతో విధులు నిర్వహించడం పోలీసు శాఖకు గర్వకారణమని పేర్కొన్నారు.






