- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పెద్ది సుదర్శన్ రెడ్డి హెల్త్ బులెటిన్ విడుదల.. ప్రస్తుతం కండీషన్ ఇదే!
మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై కీలక అప్‌డేట్ వచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై సికింద్రాబాద్ యశోద ఆస్పత్రి వైద్యులు ఇవాళ సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేశారు. గుండెపోటు గురైన అనంతరం ఆయనను మెరుగైన వైద్యం కోసం హన్మకొండ నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రికి తరలించి ఐసీయూలో (ICU) అత్యవసర చికిత్స అందిస్తున్న సంగతి తెలిసిందే.
72 గంటల పాటు న్యూరోలాజికల్ రీ-అసెస్మెంట్..
పెద్ది సుదర్శన్ రెడ్డి శ్వాసక్రియ వ్యవస్థ మెరుగ్గానే ఉన్నప్పటికీ, కార్డియాక్ అరెస్ట్ సమయంలో మెదడుకు సరిపడా ఆక్సిజన్ అందకపోవడంతో మెదడు తీవ్రంగా దెబ్బతిన్నట్లు (Anoxic Brain Injury) వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వెంటిలేటర్ సహాయంతో చికిత్స పొందుతున్నారని, ఇప్పటి వరకు మాటలకు గానీ, నొప్పికి గానీ ఎలాంటి స్పందన (Unresponsive) చూపలేదని స్పష్టం చేశారు. అంతర్జాతీయ వైద్య మార్గదర్శకాల ప్రకారం 72 గంటల పాటు న్యూరోలాజికల్ రీ-అసెస్మెంట్ (Neurological Re-assessment) నిర్వహించిన తర్వాతే ఆయన కోలుకునే అవకాశాలు, తదుపరి ఆరోగ్య స్థితిపై స్పష్టత వస్తుందని యశోద ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.






