- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కులం పేరుతో దూషణ.. నిందితుడు అరెస్ట్
కులం పేరుతో దూషించి, సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు చేసిన కేసులో ఆర్‌జీఐఏ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు.

దిశ, శంషాబాద్ : కులం పేరుతో దూషించి, సోషల్ మీడియాలో అవమానకర పోస్టులు చేసిన కేసులో ఆర్‌జీఐఏ పోలీసులు ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. కేసు వివరాలను శంషాబాద్ ఏసీపీ శ్రీకాంత్ గౌడ్ మంగళవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జూన్ 11న అందిన ఫిర్యాదు ఆధారంగా క్రైమ్ నంబర్ 551/2026 కింద కేసునమోదు చేసి, జూలై 27న నిందితుడిని హైదరాబాద్ నగరంలోని మాసబ్ ట్యాంక్ షాలిమార్ హోటల్ దగ్గర నివాసముండే ఉడిరాజ్ వన్నూరు స్వామి (34)గా గుర్తించారు. అతడి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా, రాయదుర్గం మండలం, వేపరాల గ్రామంలోని బీసీ కాలనీవాసిగా గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. విచారణలో నిందితుడు జస్ట్‌డయల్ ద్వారా క్యాటరింగ్ సేవలు అందిస్తూ, వినియోగదారులతో తలెత్తిన వివాదాల నేపథ్యంలో ఫోన్ కాల్స్‌లో అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు సోషల్ మీడియాలో వారి పరువు నష్టం కలిగించే పోస్టులు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడి వద్ద నుంచి మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అతని పై హైదరాబాద్‌లోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే 20కి పైగా కేసులు నమోదై ఉన్నట్లు వెల్లడించారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏసీపీ శ్రీకాంత్ గౌడ్, ఇన్స్పెక్టర్ సంజీవులు సూచించారు. ఆన్లైన్లో అనిపించే ప్రకటనలను నమ్మవద్దని, అదేవిధంగా క్యాటరింగ్ నిర్వాహకులను కూడా పూర్తిగా నమ్మవద్దని నిర్ధారించుకున్న తర్వాతే వారి సేవలు వినియోగించుకోవాలని సూచించారు.






