- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాఠశాల బస్సుకు తప్పిన ప్రమాదం
by Batti.Sumithra |
వట్‌పల్లి మండలంలోని అక్షర పాఠశాలకు చెందిన బస్సు మంగళవారం నిర్జపల్లి, ఉసిరికపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకు వస్తున్న సమయంలో రోడ్డు పక్కకు ఒరిగింది.

X
దిశ, వట్‌పల్లి : వట్‌పల్లి మండలంలోని అక్షర పాఠశాలకు చెందిన బస్సు మంగళవారం నిర్జపల్లి, ఉసిరికపల్లి గ్రామాల నుంచి విద్యార్థులను పాఠశాలకు తీసుకు వస్తున్న సమయంలో రోడ్డు పక్కకు ఒరిగింది. బస్సులో సుమారు 35 మంది విద్యార్థులు ఉండగా, అదృష్టవశాత్తూ ఎలాంటి ప్రాణనష్టం గానీ, గాయాలు గానీ జరగలేదు. దీంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనకు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమా, వాహనంలో సాంకేతిక లోపమా, లేక రోడ్డు దుస్థితి కారణమా అన్నది తెలియాల్సి ఉంది. ఘటన పై సంబంధిత అధికారులు విచారణ చేపట్టి అసలు కారణాలను నిర్ధారించి, పాఠశాల బస్సుల భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని స్థానికులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
Next Story






