ఉపసర్పంచ్‌ల ఆందోళన.. రూ.5 వేల గౌరవ వేతనం కోసం కలెక్టరేట్ ముట్టడి !

by Batti.Sumithra |

ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట గల తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు.

ఉపసర్పంచ్‌ల ఆందోళన.. రూ.5 వేల గౌరవ వేతనం కోసం కలెక్టరేట్ ముట్టడి !
X

దిశ, ఆసిఫాబాద్ : ఉపసర్పంచ్‌లు, వార్డు సభ్యుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంగళవారం కలెక్టరేట్ ఎదుట గల తెలంగాణ తల్లి విగ్రహం ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపసర్పంచ్‌లకు నెలకు రూ.5 వేలు, వార్డు సభ్యులకు నెలకు రూ.3 వేలు గౌరవ వేతనం మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. జీఓ నెం.38ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, గ్రామపంచాయతీల బ్యాంకు ఖాతాల్లో ఉపసర్పంచ్‌ల సంతకాలను వెంటనే నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మండల సర్వసభ్య సమావేశాలకు ఉపసర్పంచ్‌లను తప్పనిసరిగా ఆహ్వానించేలా ఆదేశాలు జారీ చేయాలని, గ్రామాల్లో చేపట్టే అభివృద్ధి పనుల శిలాఫలకాల పై ఉపసర్పంచ్‌లు, సంబంధిత వార్డు సభ్యుల పేర్లు కూడా ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తమ సమస్యల పై సానుకూలంగా స్పందించి తక్షణమే పరిష్కార చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ లు దీపక్ ముండే, చిట్ల నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Next Story