- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎరువుల దుకాణాల పై ఆకస్మిక తనిఖీలు
రెబ్బెన మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో రెబ్బెన ఎస్ఐ వెంకటకృష్ణ, మండల వ్యవసాయ అధికారి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

దిశ, రెబ్బెన : రెబ్బెన మండల కేంద్రంలోని ఎరువులు, పురుగు మందుల దుకాణాల్లో రెబ్బెన ఎస్ఐ వెంకటకృష్ణ, మండల వ్యవసాయ అధికారి దిలీప్ కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా దుకాణాల్లో నిల్వలు, లైసెన్సులు, విక్రయ రికార్డులు, గడువు తేదీలను పరిశీలించారు. తనిఖీల సందర్భంగా అధికారులు మాట్లాడుతూ గడువు ముగిసిన (ఎక్స్‌పైరీ) ఎరువులు, పురుగు మందులను విక్రయించరాదని హెచ్చరించారు. ప్రభుత్వ నిబంధనలకు లోబడి మాత్రమే ఎరువులు, పురుగు మందులు విక్రయించాలని సూచించారు. ఎంఆర్‌పీ కంటే అధిక ధరలకు విక్రయించినా, నకిలీ లేదా గడువు ముగిసిన మందులను విక్రయించినా సంబంధిత దుకాణాల పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి, అవసరమైతే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
మండల కేంద్రంలోని అన్ని ఎరువులు, పురుగుమందుల దుకాణాలను తనిఖీ చేసినట్లు అధికారులు తెలిపారు. రైతులు ఎరువులు, పురుగు మందులు కొనుగోలు చేసే సమయంలో తప్పనిసరిగా బిల్లు తీసుకోవాలని, నాసిరకం లేదా గడువు ముగిసిన మందులు విక్రయిస్తున్నట్లు గుర్తిస్తే వెంటనే వ్యవసాయ శాఖ లేదా పోలీసు అధికారులకు సమాచారం అందించాలని సూచించారు.






